8, జూన్ 2012, శుక్రవారం

తెలకపల్లి రవిగారి విమర్శకు ప్రతి విమర్శ

  కులాలూ,మతాలూ, లాంటి వాటికి స్వంత అస్తిత్వం వుండదు సమాజంలొ వున్న ఆర్దిక అసమానతలను అంటిపెట్టుకుని జీవించే పరాన్న జీవులు. కులాల సమస్య పరిస్కారాలను చుసిస్తూ అంబేద్కర్ అనేక పుస్తకాలు రాశారు కులాల,సమస్యలకుగాని,ఆర్దిక సమస్యలకుగాని మార్కిజం పనికిరాదనికుడా శలవిచ్చారు. దానిపైనే చర్చిస్తూ రంగనాయకమ్మ గారు "దళితసమస్య పరిస్కారానికి బుద్దుడు చాలడూ, అంబేద్కర్ చాలడూ, మార్క్స్ కావాలి" అనే పుస్తకం రాశారు .

   దానిపైనా,మరియూ, ఈమద్య ఆంద్రజ్యొతిలొ రాసిన అస్తవ్యెస్త సంస్కర్తలూ, అనే వ్యాసం రాశారు. ఈరొండిటిపైనా విమర్శగా తెలకపల్లి రవి గారు విమర్శగా "అపసవ్య వ్యాఖ్యతలు"  అనే వ్యాసం రాశారు దానికి సమాధానంగా రాస్తున్నాను.
 
    సుందరయ్యను కమ్యునిస్టు గాందిగా అనేక దాశాబ్దాలుగా చేస్తున్నదే కనుక దాన్ని తప్పు పట్టాల్సిన పని లేదని అంటున్నారు. రవి గారు. ఈయన గతంలొనూ జ్యొతిష్యం అనేకమంది నమ్ముతున్నారు కనుక తప్పుపట్టాల్సిన పనిలేదని అన్నారు. ఈయన ప్రకారం అనేకమంది ఏంచేసినా తప్పులేదు. కాకపొతె ఆసేసెదాంట్లొ అనేకమంది వుండాలి అప్పుడు తప్పుపట్టాల్సి పనిలేదు. ఈయన కొత్తగా కనిపెట్టిన సిద్దాంతం ఇది. ఈయన ప్రకారం అనేకమంది అనుకునే సామాజిక విషయాలలొ సైన్సు ప్రమేయం వుండకూడదు ఎందుకంటే అనేకమంది అనుకుంటున్నారు కాబట్టి.

   '"వేరు వేరు కాలాల భావజాలకు సంభంధించిన  వ్యెక్తులను పొల్చి వాధించడమే  అశాస్త్రీయం"
   రంగనాయకమ్మ గారు వేరు వేరు కాలాలకు సంభంధించి వ్యెక్తులను విమర్శించడం తన ఇష్టా ఇష్టాలతొ చేయలేదు. అంబేద్కర్ సామాజిక సమస్యలకు బుద్దుడు దర్మాన్ని పరిస్కారంగా చుసించాడు.మార్కిజం పనికిరాదని ఒకపేరాలొ అంతలొనే మార్క్స్ చెప్పినాటివన్ని బుద్దుడు చెప్పేడని ఒక పేరాలొ ఇలా పొంతన లేకుండా చెప్పెడు. కనుకనే బుద్దుడిని విమర్శించవలసి వచ్చింది. ఈవిషయాన్ని వదిలేసి తెలకపల్లి రవిగారు వేరు వేరు కాలాలకు భావజాలాన్ని విమర్శించడ అశాస్త్రీయం అని తన ఇస్టమొచ్చిన భాష్యాలు చెపుతున్నాడు. 

  అస్తిత్వ వాదాన్ని యవరూ వ్యెతిరేకించలేదు వేరు వేరు సంగాల వారిని కలుపుకొనిపొవద్దని యవరూ అనడంలేదు.ప్రదాన సమస్యను వదిలి సెకండరీ సమస్యపైన ఎంత పొరాడినా వుపయొగం వుండదు. ఆవిషయాన్నే ఆమె విమర్శించారు తెలకపల్లి లాంటి కులగజ్జి నాయకులు అర్దం చేసుకొవడం లేదు. లెనిన్ ని ప్రమానికంగా తీసుకొలేదని మీరెలాచెప్పగలరు.?

 సుందరయ్య వర్దంతి సభలకు బురువాలు కుడా వస్తున్నారంతే దానర్దమేమిటి ? రొండు వైరుద్యాల మద్య ఘర్షణ లేకుండా ఐఖ్యం ఐనారంటె రొండూ ఒకటయ్యాయని అర్దం పేరుకు మాత్రమే కమ్యునిస్టులు సిద్దాంతపరంగానూ, భావజాలపరంగానూ, ఈరొండిటిమద్య ఏమాత్రం తేడా లేదు. మార్కిజాన్ని ఏదేశానికి తగినట్టు ఆదేశం అన్వయించుకొవడంటే ఎలా అన్వయించుకొవాలి ఏవిషయంలొ అన్వయించుకొవాలి? మార్కిజమంతా శ్రమదొపిడీపైన ఆదారపడివుంది . ఇక దాన్ని వదిలేసి బుర్జువా సంస్కరణలకు పరిమితమౌవ్వాలి. ఇప్పుడు చేస్తున్నది అదే.  మార్కిజం ఆశయ సాదనకొసం అహొరాత్రులూ కౄషిచేస్తున్నారంట !! cpm పార్టీ 30యెళ్ళపాటు అదికారంలొవుండి ఏంచేసింది.?  పేదల భూములను పారిశ్రామికవెత్తలకు పంచిపెట్టింది దాన్ని అడ్డుకున్న పేదలను cpm గూండాలతొ కాల్పులు జరిపించింది.

  ఇక చివరిగా తెలకపల్లి రవిగారి గురించి చెప్పుకుందాం. T.V.  లలొ సినిమా పొగ్రాములకు యాంకర్లు ఆయా బ్యనర్లనుబట్టి ఆయా హీరొలను పొగుడుతూ వుంటారు. ఈయనను రాజకీయ విశ్లేషకుడుగా ఆయా వార్తా చానళ్ళు  పిలుస్తూ వుంటారు. ఆయా చానళ్ళకు తగినట్టు గానే మాట్లాడుతూ వుంటారు. ఈయన కమ్యునిస్టు అట!!.

2 కామెంట్‌లు:

  1. Telakapalli Ravi is not a Marxist but a hypocrite who covered himself in the garb of Marxism. తెలకపల్లి రవి గారు మార్క్సిజం ముసుగు వేసుకోకుండా ఒక ప్రాంతంపై విషం చిమ్మి ఉంటే నేను పట్టించుకునేవాణ్ణి కాదు. ఆయన మార్క్సిజం ముసుగు వేసుకోవడమే అసలు సమస్య అయ్యింది. విశాలాంధ్ర మహాసభ నాయకుడు నలమోతు చక్రవర్తి తాను గ్లోబలైజేషన్, నయా ఉదారవాద విధానాలని నమ్ముతానని బహిరంగంగా చెప్పుకున్నాడు. ఆయన ఎలాగూ మార్క్సిజంని వ్యతిరేకించే వర్గానికి చెందినవాడే కనుక ఆయన ఒక ప్రాంతంపై ఎంత విషం చిమ్మినా మార్క్సిజం పరువు పోదు. అందుకే నేను విశాలాంధ్ర మహాసభ గురించి పట్టించుకోకుండా కేవలం మార్క్సిజం ముసుగు వేసుకున్న తెలకపల్లి రవి గారి లాంటి వాళ్ళని మాత్రమే విమర్శించాల్సి వచ్చింది. ఆయన తన బ్లాగ్‌లో మావోయిస్ట్‌లని సంఘ విద్రోహ శక్తులుగా పేర్కొంటూ వ్రాసాడు. కేవలం తెలంగాణా ఉద్యమాన్నే కాకుండా ఇతర ప్రజా ఉద్యమాలని కూడా ఆయన దూషిస్తూ వ్రాయడం వల్ల నాకు ఆయనంటే రోత పుట్టింది. టివిలో తెలకపల్లి రవి గారు పాల్గొన్న చర్చా కార్యక్రమాలు చూడలేదు కానీ బ్లాగులలో ఆయన వ్రాసిన వ్రాతలు చదివితే రోత పుట్టింది. “మేము సమైక్యాంధ్రకి అనుకూలమే కానీ తెలంగాణా ఏర్పడితే అడ్డుకోము” అని తన బ్లాగ్‌లో వ్రాసిన చేతులతోనే “నాగర్‌కర్నూల్ లాంటి చోట్ల CPMకి కొన్ని వోట్లు పడ్డాయి కనుక తెలంగాణాలో కొంత మంది సమైక్యవాదులు ఉన్నట్టే” అని వ్రాయడం అంటే అది తెలంగాణావాదులని గొఱ్ఱెలని చూసినట్టు చూడడం కాదా? ఈ విషయం ఆయనకి గుర్తు చేస్తే ఆయన నా వ్యాఖ్యలని డిలీట్ చేశాడు. ఆయన పార్టీ ప్రతినిధిగా ఏమి మాట్లాడినా తప్పు కాదని కొందరు అనొచ్చు. కానీ ఆయన మార్క్సిజం ముసుగులో ఒక ప్రాంతంవాళ్ళ మీద విషం చిమ్మడం, గాంధీ లాంటి కులతత్వవాదులని పొగడడం చూడడానికే అసహ్యకరంగా ఉంది. అందుకే తెలకపల్లి రవి గారికీ, నాకూ మధ్య animosity పెరిగింది. ఆరేళ్ళ పాటు కష్టపడి మార్క్సిజం చదివినది మార్క్సిజం పరువు తీసే ఇలాంటి ముసుగు దొంగలని చూసి ఏమీ చెయ్యలేక తొంగోవడానికేనా అనే బాధ కలిగింది.

    రిప్లయితొలగించండి
  2. "దళిత సమస్య పరిష్కారానికి" పుస్తకం కినిగెలో వచ్చింది: http://kinige.com/kbook.php?id=981

    రిప్లయితొలగించండి