13, నవంబర్ 2012, మంగళవారం

విమర్శ ఎలా వుండాలి

సామాజిక జీవితరూపాలగురించిన మనిషి ఆలొచనలూ, తత్ఫలితంగా ఆ రూపాలకూ, సంభంధించిన అతని శాస్త్రీయ విశ్లెషణా, వాటి వాస్తవ చారిత్రాభివౄద్దికి వ్యతిరేక దిశలొ వుంటాయి. సంఘటనలు జరిగిన తర్వాత అతను ఆలొచించటం ప్రారంభిస్తాడు.అనగా చారిత్రక అభివౄద్ది పక్రియ అతని ముందు వుంచిన ఫలితాలతొ అతను ప్రారంభిస్తాడు. మనిషి మొదట తెలుసుకొవడానికి ప్రయత్నించేది వాటి చారిత్రక స్వబావాన్ని కాదు కేవలం వాటి అర్దాన్ని మాత్రమే. అతని   దౄ ష్టిలొ యీ గుణాలు యెప్పుడూ మారకుండా శాశ్వితంగా వుండేవి కనుక. వాటి చారిత్రక స్వబావాన్ని పరిశీలించడానికి అతను ప్రయత్నించడు.

 కొంతమంది ఏ సంఘటన జరిగినా పెట్టుబడిదారీ సమాజాన్ని నిందిస్తారని వ్యక్తి చేసిన పని పెట్టుబడిదారీ సమాజం ఎలా కారణం అని ప్రశ్నిస్తారు. నిగ్రొ అంటే ఎవరు ఒకానొక నిర్దిష్ట సమాజంలొని బానిస తూనిక రాయి బరువుకు కొలమానంగా వుంది చారిత్రకంగా అభివౄద్ది చెందిన ఒక నిర్దిష్ట సమాజంలొ మాత్రమే బరువుకు కొలమానంగా వుంది అంతేగాని దాని సహజ గుణం బరువుకు కొలమానం కాదు. ఆయా నిర్దిష్ట సమాజాలననుసరించి మనిషి వ్యవహరిస్తాడు అతని చైతన్యం సమాజ స్తాయినిమించి వుండదు.  సమాజంలొని ఏవిషయాన్ని తీసుకున్నా దాని అంతర్గత సంభందాలు పునాదిలొ వుంటాయి. ఉదాహరణకు కుటుంబాన్ని తీసుకుంటె ఒకరు పొషించేవారుగానూ, మరియొకరు పొషించబడేవారుగానూ, వున్నారు.వాళ్ళ మద్య సంభంధం అసమానంగా వుంది.ఒకరు లొబడేవారుగానూ, ఒకరు యజమానిగానూ వున్నారు.ఫలితంగా పురుషుడికి ప్రత్యెక అధికారాలు వచ్చాయి అతను ఎలాంటి తిరుగుళ్ళైనా తిరగవచ్చు అదేపని స్త్రీ చేస్తె కఠిన దండనకు గురౌతుంది. సమస్య ఎన్ని వుంటె అన్ని రూపాలలొ దర్శనమిస్తుంది. వీటికి పరిస్కార మార్గాలుగా ప్రెమతొ మార్చుకొవాలని సహనం వహించాలని రకరకాలుగా చెప్తారు. అంతేగాని ఆ సమస్యకు పునాది అయిన ఆర్దిక సంభందాన్ని ప్రశ్నించరు.ఎందుకంటే అది సమస్యను సూటిగా వ్యక్తం చేయదు. అంటే అది ఆర్దిక సమస్యగా కనిపించదు. దొంగ తిరుగుడిగా వ్యక్తం చేస్తుంది.పై పై సమస్యలకే పరిమితమైతే సమస్య ఎప్పటికీ సమస్యగానే వుంటుంది.

 మార్కిజం పైన విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్న ఒక బ్లాగరు ఏమంటున్నాడొ  చూ డండి.
"నా టపాలలొ సిద్దాంతపరమైన చర్చ చాలా తక్కువ ఎందుకంటె నేను రాసేవి రియాక్టివ్ పొస్టులు అంటే అవతలివారు చేసే ఆరొపనలను తప్పు అని నిరూపించే పొస్టులు. "
"ఇక మార్కిజం గురించి విశేఖర్ ఒక్కటే నాకు మార్కిజంలా కనపడుతునన్నావు అర్దం లేని మాట. ప్రస్తుతం బ్లాగుల్లొ మార్కిజం గురించి రాస్తున్న ప్రతివారూ చెప్పిన దాని గురించీ నేను రాయడం జరిగింది. "
"ఒకరు దొంగతనం చేసే స్తితిలొ ఎందుకున్నారనికదూ, నీ ప్రశ్నె సింపుల్ అతనికి అవసరమైన ధనం అతని వద్ద లేని కారణంగా అలా లేక పొవడానికి కారణం అతనికి సరైన పని లభించకపొవడం చాలాసార్లు అతను పని చేయడానికి నిరాకరించే సొమరి అవ్వడం ఈజీ మనికి అలవాటు పడటం "
"అతను(కార్మికుడు)చేసే పనికి తనకి రావలసినది తాను తీసుకుంటున్నాడు."
"బిల్గేట్స్ లాంటిలాంటి వారూ టాటాలూ, బిల్లాలూ, అంబానీలూ,ప్ర తి ,పారిశామిక వెత్తా మేదశ్రమ చేసే శ్రామికులే కడా?"
"భుములూ, సంపదా అంతా కొద్దిమందిచేతిలొ వుంటే నష్టం ఎమిటి?"
"పనికి తగ్గ ప్రతిఫలం దొరుకుతున్నంత వరకూ సంపద యవరి దగ్గరున్నా నష్టం ఎమీ లేదు.ఆ విధంగా దొరికే విధంగా పెట్టుబడిదారీ విదానం చుస్తుంది , న్యాయస్తానాలు వున్నాయి. " ఇలాంటి ప్రవచనాలు చాలా వున్నాయి.

  యవరైనా ఒక విషయాన్ని విమర్శించదలుచుకున్నాప్పుడు దాని మూలం ఎంచెపుతుందొ తెలుసుకుని అది ఎలా తప్పొ లేదా ఎవిధంగా అశాస్త్రీయమొ నిరూపించవలసిన బాద్యత విమర్శకుడిపైన వుంటుంది.ఇది యక్కడైనా జరిగేదే కాని మన బ్లాగరు ఏమంటున్నాడంటే బ్లాగర్లు రాసేదానిపైన మాత్రమే ఆదారపడుతున్నాను అంటున్నాడు.దాని పర్యవసానాలు యలావుంటాయంటే  నేను ఒక విషయాన్ని విమర్శిస్తున్నప్పుడు ఆవిషయం లేదా ఆఘటన అంతర్గత సంభందాల ద్వారా బాహ్యరూపం ధరించిన దౄగ్గొచరం మాత్రమే మీకు కనపడుతుంది. కార్మికుణ్ణి పెట్టుబడిదారుడు దొచుకుంటున్నాడు అన్నప్పుడు.ఎలా దొచుకుంటున్నాడనే అంతర్గత విషయాలను నేను చెప్పడం లేదు.ఆ విషయాన్ని నేను చెప్పదలిస్తె ఆ మూలాన్ని తిరిగి ఇక్కడ రాయల్సి వుంటుంది అది సాద్యం కాదు.వందల పేజీలు వుంటుంది. ఇప్పుడు మళ్ళీ మన విమర్శకుడి దగ్గరకు వస్తె దొచుకుంటున్నడనే విషయన్ని లొకాభిప్రాయం ప్రాకారం విమర్శిస్తాడు. పైన చెప్పిన విధంగా కర్మికుణ్ణి పెట్టుబడి దారుడు దొచడం లేదు తాను చేసిన పనికి పూర్తి ప్రతిఫలం పొందుతున్నాడు.ఒక విషయాన్ని లొకాభిప్రాయం ప్రకారం చెపితే అదే లొకాభిప్రాయం నాకు తెలియదా?  మన మనస్సుల నుండి సైస్ తీసేస్తె మన కంటికి కనపడే దాన్నే సత్యాలుగా బ్రమిస్తాం. భుమి బల్లపరుపుగా వుంది భుమే విశ్వానికి కేంద్రం భుమి చుట్టు సుర్యుడు తిరుగు తున్నాడు. కార్మికుడు చేసిన పనికి పూర్తి ప్రతిఫలం పొందుతున్నాడు. లాభాలు అమ్మే, కొనే వాళ్ళదగ్గరనుంచి వస్తాయి. వందల వేల కొట్లు వాళ్ళ శ్రమ ఫలితం.కాంతి మనకంటికి తెల్లగా కనిపిస్తుంది నిజానికది వివిధ వర్ణాల కలయిక. దౄగ్గొచరం ద్వారానే అంతస్సారాన్ని గుర్తించగలిగినట్లయితే వివిధ విఙ్ఞాన శాస్తాల అవసరం వుండేది కాదు.అంతర్గత సారమే దౄగ్గొచరం. అంతస్సారం దౄగ్గొచరాన్ని పూర్తిగా ఆవరించి వుండదు దౄగ్గొచరం అంతస్సారపు యించు మించు వ్యక్తీకరణ మాత్రమే. అంతస్సారం వస్తువ లొపల వుంటుంది బయట వుండేది కాదు.దౄగ్గొచరం మాటున అది దాగి వుంటుంది.పార్లమెంటరీ ప్రజాస్వమ్యపు అంతస్సారం బుర్జువా వర్గం నియంతౄత్వమే కాని అది ప్రజలందరీ అభిష్టానుసారం నడిచే ప్రభుత్వ వ్యవస్తగా కనపడుతుంది. కార్మిక వర్గ నియంతౄత్వం అనగానే అది ఒక నియంతౄవ వ్యవస్త అని స్ఫరిపిస్తుందిగానీ  దాని అంతస్సారం నిజమైన పీడిత ప్రజల ప్రజాస్వామ్యం.

      మార్కిజ పైన విషం కక్కే ప్రతి చెత్తమాటకూ జవాబులు ఇచ్చుకుంటూపొలేం.
"ఉత్పత్తి సంబందాల మొత్తమేసమాజపు ఆర్దిక నిర్మాణ చట్రం; దాని నిజమైన పునాది మీదే చట్ట బద్ద రాజకీయ ఉపరి నిర్మాణం లేస్తుంది. సామాజిక చైతన్యానికి సంభంధించిన  నిర్దిష్ట రూపాలు దానికి తగిన విధంగానే వుంటాయి. బౌతిక జీవితానికి సంభంధించిన ఉత్పత్తి విదానమే మొత్తం మీద సామాజిక , రాజకీయ, బౌద్దిక జీవిత క్రమాన్ని నిర్దేశిస్తుంది. మానవుల అస్తిత్వాన్ని నిర్దేశించేది వారి చైతన్యం కాదు. దానికి బిన్నంగా వారి సామాజిక అస్తిత్వమే వారి చైతన్యాన్ని నిర్దేశిస్తుంది." మార్క్స్ 

2 కామెంట్‌లు:

  1. అవును విమర్శించే ప్రతీవారికి సమాధానం ఇచ్చుకుంటూ పోలేం. అందునా ఒక విషయం గురించి పూర్తిగా తెలియకుండానే...కావాలని విమర్శించే వాళ్లకు అసలు బదులివ్వలేం.
    ఇక మార్క్సిజాన్ని విమర్శించే చాలా మంది...పూర్తిగా మార్క్సిజం గురించి తెలుసుకొన్నట్లు కనబడదు.
    మరో విషయమేమిటంటే....మనం మార్క్శిజం గురించి మాట్లాడితే...వాళ్లు కొందరు కమ్యూనిస్టు నాయుకులు చేసిన తప్పుల గురించి మాట్లాడతారు. వాళ్లు తప్పులు చేశారు కాబట్టి మార్క్సిజంలో లోపం ఉందంటారు.

    ఎవరి విశ్వాసాలు, నమ్మకాలు వారివి.
    విమర్శించేవాళ్లు విమర్శిస్తూనే ఉంటారు. మిగిలింది. మన పని మనం చేసుకుంటూ పోవడమే


    రిప్లయితొలగించండి